తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు స్టాఫ్ నర్స్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..!
స్టాఫ్ నర్స్ ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.;
స్టాఫ్ నర్స్ ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మొన్న ప్రకటించిన ఫలితాల్లో 893 పోస్టులను ఎందుకు హోల్డ్‌లో పెట్టారో చెప్పాలంటూ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత కూడా ఎందుకు పోస్టులు ఇవ్వలేదని అభ్యర్ధులు ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని, హైకోర్టుకెళ్తామని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభ్యర్ధులను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఓ అభ్యర్ధి ఆత్మహత్యాయత్నం చేశారు.