TS Inter Board: విద్యార్థుల మరణాలకు ఇంటర్ బోర్డే బాధ్యత వహించాలి: విద్యార్థి సంఘాలు
TS Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.;
TS Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు.. ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించాయి. భారీగా మోహరించిన పోలీసులు.. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులను అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పలువురు విద్యార్ధులు, విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్ బోర్డు వైఫల్యం వల్లే ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. విద్యార్థుల మరణాలకు ఇంటర్ బోర్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.