Swiggy: డిసెంబర్ 5 నుండి స్విగ్గీ డెలివరీలు బంద్..? డిమాండ్లు తీర్చాలంటూ..
Swiggy: హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనకు దిగారు.;
Swiggy: హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనకు దిగారు. మినిమం బేస్ పే 35 రూపాయలకు పెంచాలని, డిస్టెన్స్ పే కిలోమీటర్‌కు 12 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. రేటింగ్స్ ద్వారా వచ్చే ఇన్సెంటివ్‌ను నెలకు 4వేల రూపాయలు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. సూపర్ జోన్స్, ర్యాపిడో, షాడో ఫ్యాక్స్ వంటి థర్డ్ పార్టీలను తొలగించాలని పట్టుబడుతున్నారు. తమ డిమాండ్లు ఒప్పుకోకపోతే డిసెంబర్ 5 నుంచి డెలివరీలు ఆపేసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. పెట్రోల్, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. తమ ఆదాయం మాత్రం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.