TG : కులగణనపై తలసాని విసుర్లు

Update: 2024-11-11 09:00 GMT

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కులగణనపై మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరుతో హామీలు అమలు చేయకుండా పెండింగ్ లో పెట్టి కాలయాపన చేస్తూ ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కుల గణన సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సర్వే పూర్తికాకుండా సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన ఎలా చేస్తారు? అని తలసాని ప్రశ్నించారు. CR ఆధ్వర్యంలో ని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల నుండి వచ్చే వ్యతిరేకత తో సర్వే కు వెళ్ళే ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తలసాని అన్నారు.

Tags:    

Similar News