Tangellapalli Nikhil: అమెజాన్‌లో ఉద్యోగం.. రూ.64 లక్షల వేతనం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రతిభ

Tangellapalli Nikhil: ప్రతిభ ఉన్న చోటుకి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది.. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. అమ్మానాన్నలకు అక్షరం ముక్క రాదు.. అయితేనేం సరస్వతీ దేవి అతడిని వరించింది. చదువులో ప్రతిభ కనబరిచిన ఆ విద్యార్థికి అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది.

Update: 2022-07-28 08:39 GMT

Tangellapalli Nikhil: ప్రతిభ ఉన్న చోటుకి అవకాశం వెతుక్కుంటూ వస్తుంది.. గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి. అమ్మానాన్నలకు అక్షరం ముక్క రాదు.. అయితేనేం సరస్వతీ దేవి అతడిని వరించింది. చదువులో ప్రతిభ కనబరిచిన ఆ విద్యార్థికి అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది.

ఏడాదికి రూ.64 లక్షల వేతనం.. కొడుకు ప్రతిభ చూసి ఆనందభాష్పాలతో తల్లిదండ్రుల కళ్లు చెమర్చాయి. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి ఈశ్వరాచారి, అనితాలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నిఖిల్ 1 నుంచి 5 వరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 6 నుంచి 10 వరకు టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించాడు.

10వతరగతి పరీక్షా ఫలితాల్లో 10 జీపీఏ సాధించాడు. మరింత కష్టపడి చదివి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించుకున్నాడు. బాసర ఆర్జీయూకేటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. చివరి ఏడాదిలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అమెజాన్ సంస్థలో అతడికి అవకాశం దక్కింది. సాప్ట్‌వేర్ డెవలపర్‌గా రూ.64 లక్షల వేతనం అందుకోబోతున్నాడు.. స్పెయిన్ రాజధాని మాడ్రిట్‌లోని అమెజాన్ కంపెనీలో చేరేందుకు మరో రెండు నెలల్లో జాయిన్ అవనున్నట్లు నిఖిల్ తెలిపాడు. అంత పెద్ద సంస్థలో భారీ శాలరీతో ఉద్యోగం సంపాదించిన కొడుకుని చూసి తల్లిదండ్రులు గర్విస్తున్నారు. 

Tags:    

Similar News