Telangana: వికారాబాద్ లో యువకుడి హల్ చల్
పిల్లలు, పెద్దలు అని చూడకుండా అందరిపై దాడి చేశాడు
వికారాబాద్ జిల్లా అత్వెల్లిలో అర్ధరాత్రి యువకుడు నవీన్ హల్‌చల్ చేశాడు. తన కుమారుడి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పిల్లలు, పెద్దలు అని చూడకుండా అందరిపై దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న నవీన్.. ఇంటికి వచ్చిన బంధువులను ఒక రూమ్‌లో బంధించాడు. ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటికి తాళాలు వేశాడు. దీంతో వందకు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు బంధువులు. యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.