DAVOS: తెలంగాణకు రూ. 19,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌లో ‘స్విస్ మాల్’!
ప్రపంచ ఆర్థిక రంగానికి దిశానిర్దేశం చేసే వేదికగా గుర్తింపు పొందిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.ఈ అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పాల్గొని, భారీ స్థాయి పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకోవడంలో తెలంగాణ విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అంతర్జాతీయ కంపెనీలతో జరిపిన వరుస చర్చల ఫలితంగా సుమారు రూ.19,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు అధికారికంగా వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో ప్రధానంగా రష్మి గ్రూప్ రాష్ట్రంలో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఉక్కు, మౌలిక సదుపాయాలు, అనుబంధ రంగాల్లో ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు సమాచారం. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే క్రమంలో సర్గడ్ కంపెనీ కూడా తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఒప్పందం కుదిరింది.
ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. దావోస్ సదస్సులో భాగంగా సోలార్ ప్రొడక్ట్స్ తయారీకి సంబంధించిన ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ రాష్ట్రంలో రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పెట్టుబడులు పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణను మరింత బలపరచనున్నాయని, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాష్ట్రాన్ని నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణహితమైన వృద్ధికి ఇది దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
హైదరాబాద్‌కు ‘స్విస్ మా
సీఎం రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ కాంటన్ సీఎం క్రిస్టెల్ లూసియర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సీఎం ముందుంచారు. దీనికి వాడ్ కాంటన్ సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఫలితంగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్విస్ మాల్ హైదరాబాద్‌లో ఏర్పాటుకానుందన్న ప్రకటనకు బాట పడింది.
ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ జీసీసీ
ప్రపంచంలో తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్-GCC హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు లోరియల్ సంస్థ ఆ విషయాన్ని ప్రకటించింది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2026 సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్‌తో భేటీ తర్వాత ఆ కంపెనీ ప్రకటన చేసింది. ప్రపంచంలోనే తొలి బ్యూటీ- టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ప్రస్తుతం దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2026 సదస్సులో లోరియల్సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రకటన చేసింది. హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ–టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని వెల్లడించింది. జీసీసీ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందిస్తామని ఆ కంపెనీ సీఈవో తెలిపారు.నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు లను ఆ సంస్థ ఆహ్వానించింది. లోరియల్ జీసీసీని హైదరాబాద్‌కు తీసుకురావాలన్న ఆలోచనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆసక్తి చూపారని, ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.