ASSEMBLY: ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్

బీఏసీ సమావేశంలో నిర్ణయం... 27 వరకు బడ్జెట్ సమావేశాలు;

Update: 2025-03-13 04:00 GMT

 ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈమేరకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 13న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ ఉండనుంది.

రాజకీయాలు అంటే పిల్లలాటా? : రేవంత్

సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు సీఎల్పీ సమావేశం సీరియస్‌గా జరుగుతుండగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ బయటకు వెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఇంత సీరియస్గా చెబుతుంటే.. ఇంత నాన్ సీరియస్గా ఉంటారా? . రాజకీయాలు అంటే పిల్లలాట అనుకుంటున్నారా? , సీరియస్గా వచ్చే ఎన్నికల్లోనూ ఎలా గెలవాలనే ప్లాన్తో పని చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్ పీకారు. శాసన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతుంటే తమకు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే ఎందుకు స్పందించలేదని క్వశ్చన్ చేశారు. ప్రభుత్వ విప్‌లు పనితీరు మార్చుకోవాలని సూచించారు. అందరూ అన్ని విషయాలు మాట్లాడాలని అనుకోవద్దని, ఒక్కో సభ్యుడు ఒక్కో అంశాన్ని ఎంచుకోవాలన్నారు.

Tags:    

Similar News