KCR : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకి సీఎం కేసీఆర్ భారీ నజరానా...!
KCR : పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సకిని రామచంద్రయ్య, కనకరాజులకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు.;
KCR : పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సకిని రామచంద్రయ్య, కనకరాజులకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును సీఎం ప్రకటించారు. డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు రామచంద్రయ్యకి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు రాగా, గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు గతేడాది పద్మశ్రీ అవార్డు లభించింది. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో సీఎంను నిన్న ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా రామచంద్రయ్య కలిసారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.