KCR : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. !
KCR : నిరుద్యోగులకి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ న్యూస్ చెప్పారు.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.;
KCR : తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగాలకు సంబందించి కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 91 వేల 142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. వీటిలో దాదాపు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన 80 వేల 39 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఒక్క విద్యా శాఖలోనే దాదాపు 20 వేల నుంచి 30 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇకపై ఖాళీల విషయంలో గందరగోళం లేకుండా జాబ్ క్యాలెండర్ తీసుకువస్తామన్నారు.