AI: ఏఐ ఫేక్ వీడియోలపై తెలంగాణ ప్రభుత్వ ఆగ్రహం

Update: 2025-04-06 04:30 GMT

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఆసరాగా తీసుకుని సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న ఏఐ ఆధారిత ఫేక్ వీడియోలు, ఫోటోలు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాజాన్ని మోసగించే ఈ తరహా వీడియోలను తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంలో సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో, ‘‘ఇలాంటి ఫేక్ కంటెంట్‌‌లను ఉపేక్షించవద్దు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా అరికట్టాలి. ఇందుకోసం ప్రత్యేక సైబర్ క్రైమ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి,’’ అని సూచించారు.

Tags:    

Similar News