TG: త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్.. ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు;

Update: 2024-10-20 03:30 GMT

తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు శుభవార్త చెప్పింది. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇస్తామని ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చెప్పారు. ఈ నెలాఖరుకే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని శుభవార్త అందించారు. ఈ దీపావళి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,500-4,000 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గోషామహల్‌ నియోజకవర్గానికి కేటాయించిన 144 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. నియోజకవర్గానికి సంబంధించిన వారికి రాంపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు (Indiramma Houses) కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఏ పార్టీ అనేది చూడకుండా, కులం, మతం పట్టించుకోకుండా అర్హులైన ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు. కాంగ్రెస్ వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదలకు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా పొంగులేటి ప్రకటించారు.


అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని నిర్మించిన రెండు ప‌డుక గ‌దుల ఇళ్లు.. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ల‌భ్దిదారుల‌కు అందించారు. మ‌రి కోన్ని చోట్ల నిర్మాణ ద‌శ‌లోనే ఉన్నాయి. ఇంకోన్ని చోట్ల నిర్మాణం పూర్తి అయినా ల‌భ్దిదారుకు ఇవ్వ‌క పోవ‌డంతో ఆ ఇళ్లు ఆసాంఘీక కార్య‌కలాపాల‌కు అడ్డ‌గా మారాయి. ఆ ఇళ్ల‌లో ఇంకా గృహప్రవేశం చేయలేదు. కానీ దొంగలు మాత్రం ఆ ఇళ్లలో ప్రవేశించారు. దొంగ‌కు కాదేది అనార్హం అన్న‌ట్టుగా డోర్స్, ట్యాప్స్, క‌రెంట్ వైర్ ల‌ను దొచుకేలుతున్నారు. దీంతో ఈ రెండు ప‌డుక గ‌దుల ఇళ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లోని నాగరం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నాలుగేళ్ల క్రిత‌మే పూర్తి అయ్యాయి.

    రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్తు స్తంభాలు, ఓపెన్ జిమ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన ఇళ్లు వృథాగా ఉంటున్నాయి. దీంతో ఆ ఇళ్లు ఆసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జ‌నసంచారం లేకుండా ఖాళీగా ఉంటున్న ఇళ్లపై దొంగల కన్ను పడింది. కొత్త ఇల్లు కావడంతో ట్యాప్స్, త‌లుపులు, స్విచ్ బోర్డ్స్, ఎలక్ట్రిక్ వైరింగ్ ల‌ను దొంగ‌లు ఎత్తుకెలుతున్నారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ‌ద్ద ప్రశాంతంగా ఉండ‌డంతో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం సేవిస్తూ తలుపులు, కిటికీ అద్దాలు పగలగొడుతున్నారు. బిగించిన ట్యాప్ లను ఎత్తుకెళ్తున్నారు. సెక్యూరిటీ గార్డును నియమించినా రాత్రిళ్లు ఆకతాయిలు, దొంగల బీభత్సం ఎక్కువైంది. దీంతో వారు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ నుంచి రెండు ప‌డుక గ‌దుల ఇళ్ల‌ను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ విభాగాలకు ఆర్ అండ్ బి అధికారులు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేకుండా పోయింద‌ని స‌మాచారం.

Tags:    

Similar News