Telangana: మొదలైన ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజే 10వేల మంది విద్యార్ధులు ఆబ్సెంట్
గురువారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10,000 మందికి పైగా విద్యార్థులు గైర్హాజరయ్యారు.;
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,532 కేంద్రాలలో మొత్తం 4,52,028 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ - II కోసం నమోదు చేసుకున్నారు. కానీ 4,40,513 మంది విద్యార్ధులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు, దాదాపు 10 వేల మంది పైగా విద్యార్ధులు పరీక్షకు హాజరు కాలేదని బోర్డు తెలిపింది.
పరీక్ష సమయంలో జగిత్యాలలో మూడు, నిజామాబాద్‌లో ఒకటి చొప్పున నాలుగు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేయబడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పరీక్షా హాలులోకి రాతపూర్వక సామగ్రిని తీసుకెళ్లినందుకు ముగ్గురు విద్యార్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేయబడ్డాయి. బోర్డు నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మరియు ప్రత్యేక పరిశీలకుల బృందం విద్యార్థులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశాయి.
"విద్యార్థులు రాసిన మెటీరియల్‌ను ఎక్కడ దాచారో మాకు సమాచారం ఇవ్వలేదు. కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు ప్రత్యేక పరిశీలకుల బృందం పరీక్ష సమయంలో వారిని పట్టుకుంది. విద్యార్థులు మెటీరియల్ నుండి సమాధానాలు రాసి ఉంటే, వారు తదుపరి పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించబడరు, ”అని ఒక అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే కొంతమంది విద్యార్థులు పరీక్షా హాళ్లలో వాల్ క్లాక్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవని తెలిపారు. పరీక్షల కోసం బోర్డు చేతికి వాచీ ధరించడాన్ని నిషేధించినప్పటికీ, హాళ్లలో గోడ గడియారాలు లేవని, దీనివల్ల సమయం తెలుసుకోవడం గురించి ఇబ్బంది పడ్డామని విద్యార్థులు తెలిపారు. బోర్డు సూచనల ప్రకారం ప్రతి అరగంటకు మోగించాల్సిన గంట మోగలేదని, పరీక్షకు మిగిలి ఉన్న సమయం ఎంత ఉందో తెలుసుకోవడం కష్టమైందని విద్యార్ధులు ఆరోపించారు.
కొన్ని కేంద్రాల్లో రైటింగ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం నిషేధించబడిందని విద్యార్థులు ఆరోపించారు. మరి కొన్ని కేంద్రాల్లో బెంచీలు, కుర్చీలు వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేవని, దీనివల్ల పరీక్ష సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయని కూడా వారు విచారం వ్యక్తం చేశారు.