Cheruku Sudhakar : తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చెరుకు సుధాకర్..

Cheruku Sudhakar : తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌లో చేరారు.;

Update: 2022-08-05 07:45 GMT

Cheruku Sudhakar : తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు ఢిల్లీలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థంపుచ్చుకున్నారు. తెలంగాణ ఇంటిపార్టీని చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కాంగ్రెస్‌లో చేరడం హర్షణీయమన్నారు. చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తి అని తెలిపారు. ఇక.. భద్రాచలం ముంపునకు కారణం మోదీ, ఆయన మంత్రివర్గమే కారణమని ఆరోపించారు రేవంత్‌రెడ్డి. తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను.. బీజేపీ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందని భగ్గుమన్నారు.

Tags:    

Similar News