BRITAIN: బ్రిటన్‌ ఎన్నికల బరిలో తెలంగాణ వ్యక్తి

Update: 2024-05-16 04:30 GMT

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగు వ్యక్తి నిలబడ్డాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థిగా పార్టీ పక్రటించింది. బ్రిటన్ లోని పప్రంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్ లో పాలనా శాస్తంలో... ఉదయ్ నాగరాజు పీజీ చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత బ్రిటన్ పర్యటనలకు వెళ్లినప్పుడు పలు కార్యక్రమాల్లో ఉదయ్ నాగరాజు పాల్గొన్నారు. తెలుగు వ్యక్తి బ్రిటన్ లో ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఆయన స్వగ్రామం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News