ఐటీ రంగంలో అగ్రగామిగా తెలంగాణ: KTR
2014లో ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ఇక ఐటీ రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారుతుందని ఆనాడే చెప్పామన్నారు.;
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీహబ్‌లో ఐటీ వార్షిక నివేదిక విడుదల చేశారు. 2014లో ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ఇక ఐటీ రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారుతుందని ఆనాడే చెప్పామన్నారు.బెంగళూరుతో పోటీపడేలా హైదరబాద్‌ను నిలబెట్టామన్న కేటీఆర్... 2013-2014లో ఐటీ ఎగుమతులు కేవలం 56 వేల కోట్లు మాత్రమేనన్నారు. అయితే నేడు అది లక్షా 83వేల 569 కోట్లకు చేరిందన్నారు.