కేటీఆర్ కు సిట్ నోటీసులు.. బీఆర్ఎస్ ప్లాన్ అదేనా..?

Update: 2026-01-23 07:00 GMT

తెలంగాణలో ఇప్పుడు ఫోన్ టాపింగ్ కేసు రచ్చ నడుస్తోంది. మొన్న మంగళవారం మాజీమంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ సమయంలోనే బిఆర్ఎస్ నేతలు నానా రచ్చ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను రాజకీయంగా తట్టుకోలేక ఇలాంటి వేధింపులకు పాల్పడుతుంది అంటూ ఆరోపించారు. కేటీఆర్ అప్పుడే తనను కూడా త్వరలోనే సిట్ విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈరోజు నిజంగానే సిట్ విచారణకు పిలిచింది. ప్రస్తుతం ఆయన సిట్ విచారణలో పాల్గొన్నారు. అయితే కేటీఆర్ మాత్రం దీన్ని పాజిటివ్ కోణంలో మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తమను రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేధీస్తోంది అంటూ ప్రజల్లో సింపతి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు సింపతి రాబట్టుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తుంటారు.

ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తోందని ప్రచారం జరుగుతోంది. సింగరేణిలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణాలను బయటపెట్టినందుకే తమను ఇలా వేధిస్తున్నారు అంటూ కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఫోన్లను ట్యాప్ చేసి పర్సనల్ విషయాలను విన్నారు కాబట్టే వాళ్లను విచారణకు పిలుస్తున్నారు అంటూ చెబుతున్నారు. అటు బిజెపి నేతలు ఈ ఫోన్ టాపింగ్ కేసు మీద పెద్దగా రియాక్ట్ కావట్లేదు. వ్యూహాత్మకంగానే బిజెపి నేతలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దీన్ని గులాబీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో తమకు అనుకూలత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఈ సిట్ కేసులను, జిల్లాల రద్దు అనే ప్రచారాలను వాడుకోవాలని గులాబీ నేతలు ప్లాన్ వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి విచారణలు వాడుకుంటే ఎంతో కొంత సింపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అవి నేతల సమర్థతను బట్టి ఉంటాయి. మరి గులాబీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు వారికి లభిస్తాయి లేదా అనేది ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.

Tags:    

Similar News