TG: తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో మరో­సా­రి ఆస­క్తి­కర పరి­ణా­మా­లు

తె­లం­గా­ణ­లో తన ఉని­కి­ని చాటే ది­శ­గా అడు­గు­లు వేస్తున్న జనసేన

Update: 2026-02-05 03:30 GMT

తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో మరో­సా­రి ఆస­క్తి­కర పరి­ణా­మా­లు చోటు చే­సు­కుం­టు­న్నా­యి. ఇప్ప­టి­వ­ర­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కే పరి­మి­త­మైన రా­జ­కీయ శక్తి­గా కని­పిం­చిన జన­సేన పా­ర్టీ ఇప్పు­డు తె­లం­గా­ణ­లో తన ఉని­కి­ని చాటే ది­శ­గా అడు­గు­లు వే­స్తోం­ది. ప్ర­త్య­క్షం­గా ఎన్ని­కల బరి­లో­కి ది­గ­కుం­డా, ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­ల­ను లాం­ఛ్‌­ప్యా­డ్‌­గా చే­సు­కు­ని రా­జ­కీయ వి­స్త­ర­ణ­కు ప్ర­య­త్నిం­చ­డం వె­నుక వ్యూ­హా­త్మక ఆలో­చన ఉం­ద­నే అభి­ప్రా­యం బలం­గా వి­ని­పి­స్తోం­ది. ము­ఖ్యం­గా మి­త్ర­ప­క్ష­మైన భా­ర­తీయ జనతా పా­ర్టీ అభ్య­ర్థు­ల­కు మద్ద­తు­గా ప్ర­చా­రం చే­యా­ల­న్న ని­ర్ణ­యం, తె­లం­గాణ రా­జ­కీయ సమీ­క­ర­ణా­ల­పై ఎలాం­టి ప్ర­భా­వం చూ­పు­తుం­ద­న్న­దే ఇప్పు­డు ప్ర­ధాన చర్చ­గా మా­రిం­ది. ఈ ప్ర­చా­రం­లో భా­గం­గా జన­సేన అధి­నేత పవన్ కళ్యా­ణ్ ఈ వారం తె­లం­గా­ణ­లో పర్య­టిం­చ­ను­న్నా­రు. ఆయన సభలు, రో­డ్‌­షో­లు, మీ­డి­యా సమా­వే­శా­లు ఉం­టా­య­ని సమా­చా­రం. దీం­తో ఈ పరి­ణా­మం బీ­జే­పీ­కి లా­భ­మా? లేక అనూ­హ్యం­గా నష్టా­న్ని తె­చ్చి­పె­డు­తుం­దా? అన్న ప్ర­శ్న­లు రా­జ­కీయ వర్గా­ల్లో చర్చ­కు దా­రి­తీ­స్తు­న్నా­యి.

బీజేపీకి ‘క్రౌడ్ పుల్లర్’ అవసరం

తె­లం­గా­ణ­లో బీ­జే­పీ పరి­స్థి­తి ప్ర­త్యే­క­మై­న­ది. కేం­ద్రం­లో అధి­కా­రం­లో ఉన్న­ప్ప­టి­కీ, రా­ష్ట్ర రా­జ­కీ­యా­ల్లో మా­త్రం పా­ర్టీ ఆశిం­చిన స్థా­యి­లో దూ­సు­కు­పో­లే­క­పో­యిం­ద­న్న వి­మ­ర్శ­లు ఉన్నా­యి. నా­య­క­త్వ లోపం కంటే ఎక్కు­వ­గా, ప్ర­జ­ల్లో భా­వో­ద్వే­గా­న్ని రగి­లిం­చే, ము­ఖ్యం­గా యు­వ­త­ను ఆక­ట్టు­కు­నే ము­ఖ­చి­త్రం లే­క­పో­వ­డ­మే ప్ర­ధాన బల­హీ­న­త­గా చె­ప్పు­కుం­టు­న్నా­రు. ఈ లో­టు­ను పూ­డ్చేం­దు­కు పవన్ కళ్యా­ణ్ వంటి ప్ర­జా­ద­రణ ఉన్న నా­య­కు­డి­ని రం­గం­లో­కి దిం­చ­డ­మే బీ­జే­పీ వ్యూ­హం­గా కని­పి­స్తోం­ది. సి­ని­మా రంగం నుం­చి వచ్చిన పవన్ కళ్యా­ణ్‌­కు తె­లం­గాణ పట్టణ యు­వ­త­లో­నూ అభి­మా­ను­లు ఉన్నా­రు. సో­ష­ల్ మీ­డి­యా­లో­నూ ఆయ­న­కు గట్టి ఫా­లో­యిం­గ్ ఉంది. ఈ అం­శా­న్ని బీ­జే­పీ రా­జ­కీ­యం­గా మలు­చు­కో­వా­ల­ను­కుం­టోం­ద­న్న అభి­ప్రా­యం వి­ని­పి­స్తోం­ది. ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­లు చి­న్న ఎన్ని­క­లే అయి­నా, ఇమే­జ్ బి­ల్డిం­గ్‌­కు ఇవి ఉప­యో­గ­ప­డ­తా­య­న్న అం­చ­నా­తో­నే ఈ ప్ర­చా­రా­ని­కి శ్రీ­కా­రం చు­ట్టి­న­ట్టు తె­లు­స్తోం­ది.

 జనసేనకు ఇది విస్తరణ ప్రయోగం

ఇక జన­సేన కో­ణం­లో చూ­స్తే, ఇది కే­వ­లం మి­త్ర­ధ­ర్మం మా­త్ర­మే కాదు, దీ­ర్ఘ­కాల రా­జ­కీయ ప్ర­యో­గం కూడా. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ఇటీ­వల రా­జ­కీ­యం­గా బలం పెం­చు­కు­న్న జన­సేన, భవి­ష్య­త్తు­లో ప్రాం­తీయ పా­ర్టీ­గా కా­కుం­డా వి­స్తృత రా­జ­కీయ వే­ది­క­పై ని­ల­బ­డా­ల­న్న ఆతో ఉం­ద­న్న ప్ర­చా­రం జరు­గు­తోం­ది. తె­లం­గా­ణ­లో ఇప్ప­టి­కి సం­స్థా­గత ని­ర్మా­ణం లే­క­పో­యి­నా, పవన్ కళ్యా­ణ్ వ్య­క్తి­గత క్రే­జ్‌­తో పా­ర్టీ­కి గు­ర్తిం­పు తీ­సు­కు­రా­వ­చ్చ­న్న నమ్మ­కం జన­సేన శ్రే­ణు­ల్లో ఉంది. ప్ర­త్య­క్షం­గా పోటీ చే­య­కుం­డా, మి­త్ర­ప­క్షం తర­పున ప్ర­చా­రం చే­య­డం వల్ల రా­జ­కీ­యం­గా రి­స్క్ తక్కు­వ­గా ఉం­టుం­ద­ని కూడా భా­వి­స్తు­న్నా­రు. అదే సమ­యం­లో, పా­ర్టీ పే­రు­ను తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో పరి­చ­యం చే­య­డం, భవి­ష్య­త్తు­లో అవ­కా­శా­ల­ను పరీ­క్షిం­చు­కో­వ­డం ఈ వ్యూ­హం వెనక ఉన్న ప్ర­ధాన ఉద్దే­శ్యం­గా వి­శ్లే­ష­కు­లు చె­బు­తు­న్నా­రు.

 బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ ఆయుధమా?

అయి­తే ఈ మొ­త్తం పరి­ణా­మం­లో అసలు లాభం ఎవ­రి­కి దక్కు­తుం­ద­న్న ప్ర­శ్న ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. తె­లం­గా­ణ­లో ‘ఇంటి పా­ర్టీ’గా తనను తాను ఆవి­ష్క­రిం­చు­కు­న్న భారత రా­ష్ట్ర సమి­తి ఈ అవ­కా­శా­న్ని రా­జ­కీ­యం­గా మలు­చు­కు­నే ప్ర­య­త్నం­లో ఉం­ద­న్న అభి­ప్రా­యం బలం­గా వి­ని­పి­స్తోం­ది. పక్క రా­ష్ట్రా­ని­కి చెం­దిన పా­ర్టీ నేత తె­లం­గా­ణ­లో ప్ర­చా­రం చే­య­డా­న్ని ‘తె­లం­గాణ సెం­టి­మెం­ట్’గా మలచే అవ­కా­శం బీ­ఆ­ర్‌­ఎ­స్‌­కు దక్కిం­ద­ని రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు చె­బు­తు­న్నా­రు. గతం­లో­నూ ఇలాం­టి సం­ద­ర్భా­ల్లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ తె­లం­గాణ అస్మి­త­ను బలం­గా వి­ని­యో­గిం­చు­కు­న్న చరి­త్ర ఉంది. ఈసా­రి కూడా “తె­లం­గా­ణ­కు తె­లం­గాణ పా­ర్టీ” అనే ని­నా­దా­న్ని మరింత దూ­కు­డు­గా ప్ర­జ­ల్లో­కి తీ­సు­కె­ళ్లే ప్ర­య­త్నం జరు­గు­తుం­ద­న్న సం­కే­తా­లు కని­పి­స్తు­న్నా­యి. ము­ఖ్యం­గా పట్టణ ప్రాం­తా­ల్లో కూడా సెం­టి­మెం­ట్ రా­జ­కీ­యం­గా పని­చే­స్తుం­దా? లేక పవన్ క్రే­జ్ ముం­దు అది తగ్గి­పో­తుం­దా? అన్న­దే కీ­ల­కం­గా మా­రిం­ది.

Tags:    

Similar News