తెలంగాణ: రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం
Telangana: రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.;
పాత చిత్రం
Telangana:రేపటి నుంచి తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్‌తోపాటు,ఆన్‌లైన్ తరగతులు కొనసాగనున్నాయి. హైకోర్టులో తదుపరి విచారణ వరకు గురుకులాలను మూసి ఉంచుతారు. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతావాటికి ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలంగాణలో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్నారు.
అంతకుముందు.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. సర్కారు జీవోపై వారంపాటు స్టే విధించిన హైకోర్టు.. హాస్టల్స్‌లో సౌకర్యాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కరోనా నేపథ్యం విద్యా సంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేయాలని బాలకృష్ణ అనే పిటిషనర్ హైకోర్టును కోరారు. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతున్నాయి.
ఓ వైపు కరోనా థర్డ్‌వేవ్ భయం... మరోవైపు స్కూళ్ల ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లపై పేరెంట్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తప్పనిసరి ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను నిలిపివేసింది. గురుకులాలు, హాస్టళ్లు తెరవకూడదని స్పష్టం చేసింది. స్కూళ్లకు రావాలని, ప్రత్యక్ష బోధనకు హాజరు కావాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడికి గురిచేయద్దని సూచించింది. ఇక ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులను పంపించడం తల్లిదండ్రుల విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పింది హైకోర్టు.