తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న శనివారం నాడు శిల్పాకళా వేదికలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైనవారికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయబోతున్నారు. 18 శాఖలకు సంబంధించి 563 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సీఎస్ రామకృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘విద్యా పునరుజ్జీవన వేడుక’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం తెలంగాణకు ప్రేరణనిచ్చిందని అన్నారు.