TERROR: ఆముదంతో విషం తయారు చేసి వందలమందిని చంపే కుట్ర

భారీ కుట్రపన్నిన హైదరాబాద్ ఉగ్రవాది.. ముగ్గురు ముష్కరులను అరెస్ట్ చేసిన ఏటీఎస్.. ఉగ్రవాదులను విచారిస్తున్న గుజరాత్ ఏటీఎస్

Update: 2025-11-10 08:15 GMT

గు­జ­రా­త్‌­లో భారీ ఉగ్ర కు­ట్ర­కు ప్ర­య­త్నిం­చిన సయ్య­ద్ అహ్మ­ద్ మొ­హి­యు­ద్దీ­న్‌­తో పాటు మరో ఇద్ద­రు ఐసి­స్‌ సా­ను­భూ­తి­ప­రు­ల­ను గు­జ­రా­త్‌ ఏటీ­ఎ­స్‌ పో­లీ­సు­లు అరె­స్ట్ చేసి వి­చా­రి­స్తు­న్నా­రు. ఈ వి­చా­ర­ణ­లో సం­చ­లన వి­ష­యా­లు బహి­ర్గ­త­మ­య్యా­యి. మొ­హి­యు­ద్దీ­న్‌ తన ఇం­టి­నే ప్ర­యో­గ­శా­ల­గా మా­ర్చి ఆము­దం గిం­జ­ల­ను ప్రా­సె­స్‌ చే­సిన తర్వాత మి­గి­లి­పో­యిన వ్య­ర్థాల నుం­చి ప్ర­మా­ద­క­ర­మైన రై­సి­న్‌ అనే విష రసా­య­నా­న్ని తయా­రు­చే­య­టం కల­క­లం సృ­ష్టిం­చిం­ది. అం­తే­గాక అతడు రద్దీ­గా ఉండే ఫు­డ్‌ మా­ర్కె­ట్ల­ను పరి­శీ­లిం­చి­న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఈ జా­బి­తా­లో ది­ల్లీ­లో­ని ఆజా­ద్‌­పు­ర్‌ మండీ, అహ్మ­దా­బా­ద్‌ నరో­డా ఫ్రూ­ట్‌ మా­ర్కె­ట్‌, లఖ్‌­న­వూ­లో­ని ఆర్‌­ఎ­స్‌­ఎ­స్‌ కా­ర్యా­ల­యం ఉన్న­ట్లు సమా­చా­రం. ఈ ప్రాం­తా­ల్లో రద్దీ, ప్ర­జా కా­ర్య­క­లా­పా­లు ఎక్కు­వ­గా ఉం­డ­టం వల్లే వా­టి­ని ఎం­చు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. నిం­ది­తు­లు హై­ద­రా­బా­ద్‌­కు చెం­దిన డా­క్ట­ర్‌ అహ్మ­ద్‌ మొ­హి­యు­ద్దీ­న్‌ సయ్య­ద్, ఉత్త­ర్‌­ప్ర­దే­శ్‌­కు చెం­దిన ఆజా­ద్‌ సు­లే­మా­న్‌ షేక్, మొ­హ­మ్మ­ద్‌ సు­హె­ల్‌ సలీం­ఖా­న్‌­లు­గా గు­జ­రా­త్ ఏటీ­సీ పే­ర్కొం­ది. వీ­రి­ని మరింత లో­తు­గా వి­చా­రిం­చ­ను­న్నా­రు. డా­క్ట­ర్ అహ్మ­ద్ మొ­హి­యు­ద్ది­న్ సయ్య­ద్, ఆజా­ద్ సు­లే­మా­న్ షేక్, మొ­హ­మ్మ­ద్ సు­హే­ల్ మొ­హ­మ్మ­ద్ సలీం ఖాన్ అనే ఈ ము­గ్గు­రి­కి.. ఐసి­స్ ఉగ్ర­వాద సం­స్థ­తో సం­బం­ధా­లు ఉన్నా­య­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు. టె­లీ­గ్రా­మ్ ద్వా­రా వీరు ఐసి­స్ హ్యాం­డ్ల­ర­తో టచ్‌­లో ఉన్నా­రు. పా­కి­స్థా­న్ ఉగ్ర­వా­దు­ల­తో­నూ వీరు సం­బం­ధా­లు కొ­న­సా­గి­స్తు­న్నా­రు. వీ­రి­పై ఏడా­ది కా­లం­గా నిఘా ఉం­చిన భద్ర­తా బల­గా­లు.. ఆయు­ధాల కోసం గు­జ­రా­త్‌­కు వచ్చిన సం­ద­ర్భం­లో అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు.

ఈ ము­గ్గు­రి­లో హై­ద­రా­బా­ద్‌­కు చెం­దిన అహ్మ­ద్ మొ­హి­యు­ద్దీ­న్.. చై­నా­లో ఎం­బీ­బీ­ఎ­స్ చది­వి­న­ట్లు ఏటీ­ఎ­స్ అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. అబు ఖా­దీ­మ్ అనే ఇస్లా­మి­క్ స్టే­ట్ - ఖో­రా­స­న్ ప్రా­వి­న్స్ (ఐఎ­స్‌­కే­పీ) ఉగ్ర­వా­ది­తో అతడు టచ్‌­లో ఉన్న­ట్లు పో­లీ­సుల వి­చా­ర­ణ­లో తే­లిం­ది. రై­సి­న్‌­ను తయా­రు చే­సిన హై­ద­రా­బా­ద్ ఉగ్ర­వా­ది.. దా­న్ని ప్ర­యో­గిం­చ­డా­ని­కి పా­కి­స్థా­న్ నుం­చి ఆదే­శాల కోసం ఎదు­రు చూ­స్తు­న్న­ట్లు ఏటీ­ఎ­స్ అధి­కా­రు­లు తె­లి­పా­రు. మొ­హి­యు­ద్దీ­న్ గతం­లో రె­స్టా­రెం­ట్ బి­జి­నె­స్ చే­శా­డు. అక్క­డే ఆము­దం గిం­జ­ల­ను ఉం­చే­వా­డ­ని.. వా­టి­ని రై­సి­న్ తయా­రీ­కి వా­డి­న­ట్లు అధి­కా­రు­లు చె­ప్పా­రు.

Tags:    

Similar News