TERROR: హైదరాబాద్‌లో సామూహిక హత్యలకు ప్లాన్..!

ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో ఏటీఎస్ తనిఖీలు.. ఇంట్లో మరిన్ని విష పదార్థాలు!.. సామూహిక హత్యలకు ప్లాన్

Update: 2025-11-14 04:30 GMT

హై­ద­రా­బా­ద్‌ ఉగ్ర­వా­ది అహ్మ­ద్ మొ­హి­యు్దీ­న్ సయ్య­ద్ వి­చా­ర­ణ­లో సం­చ­లన వి­ష­యా­లు వె­ల్ల­డిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది. గు­జ­రా­త్ యాం­టీ టె­ర్ర­రి­స్ట్ స్క్వా­డ్ పో­లీ­సు­లు ఈ ఉగ్ర­వా­ది­ని మూడు రో­జుల క్రి­తం అరె­స్ట్ చే­శా­రు. అహ్మ­ద్.. హై­ద­రా­బా­ద్ లో పె­ద్ద ఎత్తున సా­మూ­హిక విష ప్ర­యో­గా­ని­కి ప్ర­ణా­ళిక రచిం­చా­డ­ని పో­లీ­సు వి­చా­ర­ణ­లో తే­లిం­ది. రా­జేం­ద్ర నగర్ సర్కి­ల్ ఫో­ర్ట్ వ్య కా­ల­నీ­లో ని­వా­సం ఉం­టు­న్న సయ్య­ద్...చై­నా­లో ఎం­బీ­బీ­ఎ­స్ చది­వా­డు. ఆ తరు­వాత ఆన్ లైన్ కన్స­ల్టెం­ట్ డా­క్ట­ర్ గా పని చే­స్తూ ఉగ్ర­వా­దు­ల­తో పరి­చ­యం పెం­చు­కు­న్నా­డు. ఆ క్ర­మం­లో పా­కి­స్తా­నీ­హ్యాం­డ్ల­ర్ల నుం­చి అం­దిన ఆదే­శాల మే­ర­కు దే­శం­లో ప్రా­ణాం­త­క­మైన రి­సి­న్ కె­మి­క­ల్ తో దా­డు­లు చే­సేం­దు­కు ప్లా­న్ చే­శా­డు. ప్ర­పం­చం­లో­నే అత్యంత ప్రా­ణాం­త­క­మైన జీవ వి­షా­ల్లో రి­సి­న్ ఒకటి. రుచి, వాసన లే­క­పో­వ­డం దీని ప్ర­త్యే­కత. దీ­ని­ని ఎం­దు­లో కలి­పి­నా ఎవరూ గు­ర్తు­ప­ట్ట­లే­రు. చి­వ­ర­కు నీ­ళ్ళ­ల్లో కలి­పి­నా కూడా తె­లి­య­దు. అం­దు­కే ప్ర­జ­ల­ను చం­పేం­దు­కు దీ­ని­ని ఈ డా­క్ట­ర్ ఉగ్ర­వా­ది ఎం­చు­కు­న్నా­డ­ని పో­లీ­సు­లు చె­బు­తు­న్నా­రు. ఈ పా­యి­జ­న్ ను దే­శం­లో­ని ప్ర­ధాన నగ­రా­ల్లో మంచి నీ­ళ్ళు, గుడి ప్ర­సా­దా­ల్లో కలి­పి ఇచ్చేం­దు­కు ప్లా­న్ చే­శా­డు డా­క్ట­ర్ సయ్య­ద్ మొ­హ­యు­ద్దీ­న్. వి­షా­న్ని ఇవ్వ­డం ద్వా­రా దే­శం­లో వే­లా­ది మంది మర­ణిం­చే­లా ప్ర­ణా­ళి­క­లు తయా­రు చే­సు­కు­న్న­ట్లు పో­లీ­సు­లు చె­బు­తు­న్నా­రు.

మరోసారి ఏటీఎస్ తనిఖీలు

తా­జా­గా మరో­సా­రి గు­జ­రా­త్ యాం­టీ టె­ర్ర­రి­స్ట్ స్క్వా­డ్ మరో­సా­రి తని­ఖీ­ల­ను చే­ప­ట్టిం­ది. హై­ద­రా­బా­ద్ లోని రా­జేం­ద్ర­న­గ­ర్, చాం­ద్రా­యణ గు­ట్ట, చా­ర్మి­నా­ర్ లలో సో­దా­లు చే­సిం­ది. రా­జేం­ద్ర­న­గ­ర్‌­లో­ని పో­ర్ట్ వ్యూ కా­ల­నీ­లో ఐదు­గు­రు స్పె­ష­ల్ ఏటీ­ఎ­స్ అధి­కా­రు­లు తని­ఖీ­లు ని­ర్వ­హిం­చిం­ది. ఇం­దు­లో ఉగ్ర­వా­ది అహ్మ­ద్ ఇం­ట్లో గం­ట­న్న­ర­కు పైగా సో­దా­లు చే­సిం­ది. వీ­టి­ల్లో­రె­సి­న్ చేసే యం­త్రా­లు, అది ఎలా తయా­రు చే­యా­లో తె­లి­పే బు­క్స్ తో పాటూ భా­రీ­గా రై­సి­న్ వి­ష­ప­దా­ర్థం తయా­రీ­కి ఉప­యో­గిం­చిన ము­డి­ప­దా­ర్థా­లు పట్టు­బ­డ్డా­యి. వీ­ట­న్నిం­టి­నీ­ఏ­టీ­ఎ­స్ స్వా­ధీ­నం చే­సు­కుం­ది. అలా­గే మరో­వై­పు ఏపీ­లో కూడా యాం­టీ టె­ర్ర­రి­స్ట్ స్క్వా­డ్ సో­దా­లు చే­సేం­దు­కు సన్నా­హా­లు చే­స్తోం­ది. అక్కడ కూడా సలీ­ప­ర్ సెల్ పాగా వే­సి­న­ట్లు సమా­చా­రం రా­వ­డం­తో దా­డు­లు ని­ర్వ­హిం­చా­ల­ని డి­సై­డ్ అయిం­ది. గుం­టూ­రు­లో ముం­బై ఏటీ­ఎ­స్ దా­డు­లు చే­స్తోం­ది. ఉగ్ర­వా­దు­ల­కో­సం సె­ర్చ్ ఆప­రే­ష­న్ ను ని­ర్వ­హి­స్తోం­ది. సయ్య­ద్ నుం­చి రెం­డు గ్లో­క్ పి­స్ట­ల్స్, ఒక బె­రె­ట్టా పి­స్ట­ల్, 30 లైవ్ కా­ర్ట్రి­డ్జ్‌­లు, నా­లు­గు లీ­ట­ర్ల కా­స్ట­ర్ ఆయి­ల్‌­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్న­ట్లు ATS తె­లి­పిం­ది. అవి­కా­కుం­డా మూడు మొ­బై­ల్ ఫో­న్లు, రెం­డు ల్యా­ప్‌­టా­ప్‌­ల­ను కూడా గు­జ­రా­త్ యాం­టీ టె­ర్ర­రి­స్ట్ స్క్వా­డ్ స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు.

Tags:    

Similar News