TG: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇంకెప్పుడు..?

జనగణనతోనే అడ్డంకి అన్న ఊహాగానాలు

Update: 2026-04-12 04:30 GMT

తె­లం­గా­ణ­లో స్థా­నిక సం­స్థల రా­జ­కీ­యా­లు మరో­సా­రి వే­డె­క్కు­తు­న్నా­యి. సర్పం­చ్‌, ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల­తో ఉత్సా­హం­గా ముం­దు­కు సా­గిన రా­జ­కీయ వా­తా­వ­ర­ణం, ఇప్పు­డు ఎం­పీ­టీ­సీ–జె­డ్పీ­టీ­సీ ఎన్ని­కల చు­ట్టూ తి­రు­గు­తోం­ది. ఈ ఎన్ని­క­లు ఎప్పు­డు జరు­గు­తా­య­న్న ప్ర­శ్న­కు స్ప­ష్ట­మైన సమా­ధా­నం రా­క­పో­వ­డం­తో అభ్య­ర్థు­ల్లో ఒక­వై­పు ఆశలు, మరో­వై­పు అని­శ్చి­తి నె­ల­కొం­ది. అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ సైతం వ్యూ­హా­త్మ­కం­గా అడు­గు­లు వే­స్తుం­డ­గా, ఎన్ని­కల షె­డ్యూ­ల్‌­పై ఇంకా స్ప­ష్టత లే­క­పో­వ­డం చర్చ­నీ­యాం­శ­మైం­ది. రా­ష్ట్రం­లో ఇటీ­వల జరి­గిన సర్పం­చ్‌, ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ ఆశిం­చిన దా­ని­కం­టే మె­రు­గైన ఫలి­తా­ల­ను సా­ధిం­చిం­ది. ఈ వి­జ­యో­త్సా­హం­తో వెం­ట­నే ఎం­పీ­టీ­సీ, జె­డ్పీ­టీ­సీ ఎన్ని­క­ల­ను కూడా ని­ర్వ­హిం­చా­ల­ని ప్రా­రం­భం­లో భా­విం­చిం­ది. క్షే­త్ర­స్థా­యి­లో పా­ర్టీ నా­య­కు­లు అభ్య­ర్థుల ఎం­పిక ప్ర­క్రి­య­ను కూడా వే­గ­వం­తం చే­శా­రు. కానీ పరి­స్థి­తు­లు అను­కూ­లం­గా లే­క­పో­వ­డం­తో ప్ర­భు­త్వం తక్షణ ని­ర్ణ­యం తీ­సు­కో­వ­డం­లో జా­గ్ర­త్త­లు పా­టి­స్తోం­ది.

అడ్డంకి జనగణనతోనేనా...

ప్ర­స్తు­తం ఈ ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­కు ప్ర­ధాన అడ్డం­కి­గా దే­శ­వ్యా­ప్తం­గా జర­గ­ను­న్న జనా­భా లె­క్కల ప్ర­క్రియ ని­లు­స్తోం­ది. మే 11 నుం­చి జూన్ 9 వరకు మొ­ద­టి విడత జన­గ­ణన జర­గ­నుం­డ­గా, తదు­ప­రి దశ 2027 ఫి­బ్ర­వ­రి­లో ప్రా­రం­భ­మ­వు­తుం­ది. ఈ నే­ప­థ్యం­లో ఎన్ని­క­ల­ను వెం­ట­నే ని­ర్వ­హిం­చా­లం­టే జన­గ­ణన ప్రా­రం­భా­ని­కి ముం­దే పూ­ర్తి చే­యా­ల్సి ఉం­టుం­ది. లే­క­పో­తే ప్ర­భు­త్వ యం­త్రాం­గం­పై సి­బ్బం­ది కొరత ఒత్తి­డి పడే అవ­కా­శం ఉంది. అం­దు­వ­ల్ల జన­గ­ణన పూ­ర్త­య్యా­కే ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చ­డం మం­చి­ద­నే అభి­ప్రా­యం ప్ర­భు­త్వ వర్గా­ల్లో వి­ని­పి­స్తోం­ది. ఇం­కొక వైపు, మండల పరి­ష­త్‌, జి­ల్లా పరి­ష­త్ వ్య­వ­స్థ­ల­పై సమ­గ్ర మా­ర్పు­లు తీ­సు­కు­రా­వా­ల­నే ఆలో­చన కూడా ప్ర­భు­త్వ పె­ద్దల వద్ద చర్చ­కు వచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ వ్య­వ­స్థ­ను మరింత పా­ర­ద­ర్శ­కం­గా, సమ­ర్థ­వం­తం­గా మా­ర్చే ది­శ­గా ప్ర­క్షా­ళన అవ­స­ర­మ­నే అభి­ప్రా­యం వ్య­క్త­మ­వు­తోం­ది. అయి­తే దీ­ని­పై ఇప్ప­టి­వ­ర­కు ఎలాం­టి అధి­కా­రిక ప్ర­క­టన వె­లు­వ­డ­లే­దు. రాజకీయంగా చూస్తే పరిస్థితి మరోలా ఉంది. మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కూడా చర్చ కొనసాగుతోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు విద్యార్థుల పరీక్షలు, అలాగే ఇతర రాష్ట్రాల ఎన్నికలు ముగియాల్సిన నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్నికలకు అనుకూల సమయం అని భావించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగా ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సంకేతాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేడర్‌ను సిద్ధం చేసే పనిలో పడింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ నాయకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. టికెట్లు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, కేవలం పైరవీలతో అవకాశాలు రావని ఆయన స్పష్టం చేస్తున్నారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ఆదరణ పొందిన వారికే టికెట్లు కేటాయిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్ని­క­ల్లో కాం­గ్రె­స్ 80 శాతం స్థా­నా­ల­ను గె­లు­చు­కో­వా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. జి­ల్లా, మండల పరి­ష­త్తు­ల­పై పూ­ర్తి ఆధి­ప­త్యం సా­ధిం­చేం­దు­కు పా­ర్టీ వ్యూ­హా­త్మ­కం­గా కదు­లు­తోం­ది. ఈ క్ర­మం­లో జి­ల్లా అధ్య­క్షు­లు, మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు, ము­ఖ్య నా­య­కు­ల­కు ప్ర­త్యేక బా­ధ్య­త­లు అప్ప­గి­స్తూ పా­ర్టీ ని­ర్మా­ణా­న్ని బలో­పే­తం చేసే ప్ర­య­త్నా­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. అసెం­బ్లీ ని­యో­జ­క­వ­ర్గాల వా­రీ­గా పా­ర్టీ పరి­స్థి­తి­ని సమీ­క్షి­స్తూ, నేతల మధ్య ఉన్న వి­భే­దా­ల­ను పరి­ష్క­రిం­చ­డం­పై కూడా పీ­సీ­సీ చీఫ్ దృ­ష్టి పె­ట్టా­రు. పాత, కొ­త్త నా­య­కుల మధ్య సమ­న్వ­యం పెం­చ­డం ద్వా­రా ఎన్ని­క­ల్లో సమి­ష్టి­గా పోటీ చే­యా­ల­నే లక్ష్యం­తో ఆయన ముం­దు­కు సా­గు­తు­న్నా­రు. బూత్ స్థా­యి­లో పా­ర్టీ బలా­న్ని పెం­చేం­దు­కు చే­ప­ట్టిన కా­ర్య­క్ర­మా­ల­పై కూడా జి­ల్లాల పర్య­ట­న­ల్లో సమీ­క్ష­లు ని­ర్వ­హి­స్తు­న్నా­రు. తె­లం­గా­ణ­లో ఎం­పీ­టీ­సీ, జె­డ్పీ­టీ­సీ ఎన్ని­క­ల­పై స్ప­ష్టత లే­క­పో­యి­నా, రా­జ­కీ­యం­గా మా­త్రం రంగం సి­ద్ధ­మ­వు­ది. ఒక­వై­పు జన­గ­ణన వంటి పరి­పా­ల­నా అం­శా­లు ఎన్ని­కల షె­డ్యూ­ల్‌­ను ప్ర­భా­వి­తం చే­స్తుం­డ­గా, మరో­వై­పు కాం­గ్రె­స్ పా­ర్టీ మా­త్రం ముం­దు­గా­నే వ్యూ­హా­ల­తో కదు­లు­తోం­ది.

Tags:    

Similar News