ANITHA: వైసీపీకి "వి వి గన్" అని పేరు పెట్టుకోండి

జగన్‌కు హోంమంత్రి అనిత సూచన

Update: 2026-04-11 15:22 GMT

 ఏపీ రా­జ­కీ­యా­ల్లో మరో­సా­రి మాటల యు­ద్ధం వే­డె­క్కిం­ది. అధి­కార పక్షం–ప్ర­తి­ప­క్షం మధ్య ఆరో­ప­ణ­లు, ప్ర­తి­యా­రో­ప­ణ­లు మరింత ము­దు­రు­తు­న్న వేళ, హోం­మం­త్రి వం­గ­ల­పూ­డి అనిత వై­సీ­పీ­పై ఘా­టైన వ్యా­ఖ్య­లు చే­శా­రు. వై­సీ­పీ వి­ధా­నం అభి­వృ­ద్ధి కంటే వి­ధ్వం­సా­ని­కే ప్ర­తీ­క­గా మా­రిం­ద­ని ఆమె వి­మ­ర్శిం­చా­రు. వై­సీ­పీ ని­నా­దా­లు ప్ర­జల ప్ర­యో­జ­నా­ల­కు కా­కుం­డా హిం­సా­త్మక రా­జ­కీ­యా­ల­కు దా­రి­తీ­స్తు­న్నా­య­ని అనిత ఎద్దే­వా చే­శా­రు. ఆ పా­ర్టీ­కి ఉన్న ఫ్యా­న్ గు­ర్తు తీ­సే­సి గొ­డ్డ­లి పె­ట్టు­కో­వా­ల­ని ఆమె వ్యం­గ్యం­గా వ్యా­ఖ్యా­నిం­చా­రు. మాజీ ము­ఖ్య­మం­త్రి జగన్ చే­సిన వ్యా­ఖ్య­ల­పై స్పం­ది­స్తూ, వ్య­క్తి­గత వి­మ­ర్శ­ల­తో రా­జ­కీ­యా­లు చే­య­డం సరైం­ది కా­ద­ని సూ­చిం­చా­రు. అధి­కార దా­హం­తో తం­డ్రి మర­ణా­న్ని రా­జ­కీ­యం­గా ఉప­యో­గిం­చు­కు­న్నా­ర­ని, తల్లి, చె­ల్లి­ని అవ­మా­న­కర పరి­స్థి­తు­ల్లో­కి నె­ట్టా­ర­ని జగ­న్‌­పై ఆరో­పిం­చా­రు. ప్ర­జ­లు ఈ అం­శా­ల­ను గు­ర్తుం­చు­కో­వా­ల­ని ఆమె కో­రా­రు. ఇదే సమ­యం­లో కడప జి­ల్లా ఖా­జీ­పే­ట­లో చో­టు­చే­సు­కు­న్న కీ­ర్తన హత్య ఘట­న­పై కూడా హోం­మం­త్రి స్పం­దిం­చా­రు. నిం­ది­తు­డి­పై కఠిన చర్య­లు తప్ప­వ­ని స్ప­ష్టం చే­శా­రు. పో­లీ­సుల ఒత్తి­డి కా­ర­ణం­గా నిం­ది­తు­లు భయం­తో పా­రి­పో­వ­డం లేదా ఆత్మ­హ­త్య­ల­కు పా­ల్ప­డు­తు­న్నా­ర­ని పే­ర్కొ­న్నా­రు. అయి­న­ప్ప­టి­కీ చట్టం తన పని తాను చే­సు­కుం­టుం­ద­ని, న్యా­యం జరి­గే­లా ప్ర­భు­త్వం కట్టు­బ­డి ఉం­ద­ని ఆమె వె­ల్ల­డిం­చా­రు.

రాజకీయ స్వార్థం కోసం కన్నతల్లిని, చెల్లెలిని కూడా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. తండ్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని సైతం రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు. విభజన సమయంలో సోనియా గాంతో లాలూచీ పడి జగన్ బెయిల్ తెచ్చుకున్నారన్నారని తెలిపారు. తన కోసం పాదయాత్ర చేసిన షర్మిలను సైతం పక్కన పెట్టడం ఆయన నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తన ఐదేళ్ల పాలనలో విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారని , ఆ దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీకి "వి వి గన్" అని పేరు మార్చుకుంటే బాగుంటుందని అనిత సలహా ఇచ్చారు. ప్రజలకు సినిమా చూపిస్తానన్న జగన్‌కు, ఎన్నికల్లో ప్రజలే అసలైన సినిమా చూపించారని ఆమె ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News