లగచర్ల దాడి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నరేందర్ రెడ్డి, సురేశ్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు పోలీసులు రాబట్టారు. లగచర్లలో దాడికి ముందు జోరుగా లిక్కర్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. దాడికి ముందు 3 రోజుల పాటు ఈ లిక్కర్ పార్టీలు జరిగాయని, కోస్గిలో మందు కొని లగచర్లకు సురేష్ తరలించినట్లు తెలిపారు. సురేశ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూ సేకరణను అడ్డుకునేందుకు పక్కా స్కెచ్ వేశారన్నారు. బీఆర్ఎస్ నేతలు స్థానికులను రెచ్చగొట్టి, దాడులకు దిగారనీ.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. భూసేకరణను అడ్డుకోవడం, ఆర్థిక సాయంపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.