Hydra Effect: కబ్జాదారుల గుండెల్లో దడ.. దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు..
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు సరస్సు సమీపంలోని 204 భవనాలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది.;
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు సమీపంలోని 204 భవనాలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేయడంతో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుడుతోంది. దుర్గం చెరువుపై అక్రమ నిర్మాణాలపై స్పందించి ఈ చర్య తీసుకున్నారు.
హైడ్రా నోటీసులు
ప్రభావిత భవనాలలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి పలువురు ఐఏఎస్, IRS అధికారుల యొక్క అనేక నివాసాలు కూడా ఉన్నాయి. దుర్గం చెరువు చుట్టూ వందలాది విల్లాలతో ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారంతా ఇక్కడ నివసిస్తుంటారు. ఇది హైటెక్ సిటీ పరిసరాల్లో ఉంది.
తమ ఇళ్లను కూల్చివేసే అవకాశం ఉందని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అవి చట్టబద్ధంగా నిర్మించబడ్డాయని ఇప్పుడు వీటిని కూల్చే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు.