భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాములు కల్యాణ వేడుకలో వినియోగించేందుకు ప్రత్యేకంగా కొందరు చేనేత కార్మికులు భద్రాచలం చేరుకొని వస్త్రాల తయారీని ప్రారంభించారు. 4800 పోగులు, ఐదు రంగుల్లో శ్రేష్ఠమైన పట్టుదారాలతో అమ్మవారికి చీర లు, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామికి ఆరు పట్టు పం చలు, కండువాలు తయారు చేయనున్నారు. వీటి తయారీకి పోచంపల్లి నుంచి నేత కార్మికులను తెలం గాణ పద్మశాలి సంఘ కార్యదర్శి ఎస్.ఎస్.జయరాజ్ తెప్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదేవిధంగా వస్త్రాలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మొదటి రోజు ఆలయ ఈవో రమాదేవి పూజలు చేసి వస్త్రాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.