Nalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్‌లో ఫార్మసీ విద్యార్థులు గల్లంతు..
Nalgonda: నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.;
Nalgonda: నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. పీఏ పల్లి మండలం అంగడిపేట దగ్గర అక్కంపల్లి రిజర్వాయర్‌లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు.. చిలుకూరు బాలాజీ ఫార్మసీ కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు నాగార్జున సాగర్ టూర్ కోసం వెళ్లారు.. వచ్చేదారిలో అక్కంపల్లి రిజర్వాయర్ దగ్గర ఆగారు.. స్నానం చేసేందుకు నదిలో దిగి గల్లంతయ్యారు.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.