TG : ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి

Update: 2024-10-29 09:45 GMT

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లోని ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు స్నేహితులు గల్లంతైన దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గల్లంతై యువకుల ఆచూకీ కోసం రెండు రాష్ట్రాల రెస్క్యూ టీం రెండు రోజుల పాటు శ్రమించి జహీర్ హుస్సేన్, ఇర్షాద్ ల మృతదేహాలను ఆదివారం రెస్క్యూ టీం వెలికితీయగా సోమవారం మూడోవ రోజు మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలంలో ని వెంచపల్లి వద్ద ముహిస్ మృతదేహాన్ని గుర్తించారు. నదిలో గల్లంతైన యువకులు ప్రాణాలతో తిరిగి వస్తానని ఎదురు చూసిన కన్నా వారికి కడుపుకోతే మిగిలింది. గోల్కొండ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News