Traffic Challan Clearance: ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌.. ప్రభుత్వానికి రూ.240 కోట్ల ఆదాయం..

Traffic Challan Clearance: ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వచ్చిందన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌.;

Update: 2022-03-30 01:46 GMT

Traffic Challan Clearance: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వచ్చిందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌. ఇప్పటివరకు 2కోట్ల 50 లక్షల మంది వాహనదారులు పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారన్నారు. దీంతో ప్రభుత్వానికి 240 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఇక చలాన్లపై రాయితీ ఈనెల 31 అర్ధరాత్రి వరకే ఉంటుందన్నారు. ఆలోగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలన్నారు. లేదంటే కఠిన చర్యలుంటాయంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్‌

Tags:    

Similar News