PHONE TAP: త్రిపుర గవర్నర్ ఫోన్ ట్యాప్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణమాలు.. ప్రకంపనలు రేపుతున్న వ్యవహారం;
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. ఈ కేసులో ఇంద్రసేనారెడ్డి వ్యక్తిగత సహాయకుడు విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడగా.. అందులో గవర్నర్ పేరు ఉండడం కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
సిట్ దర్యాప్తు ముమ్మరం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడి కాగా.. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26న ఆయన గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు.
ఇప్పటికే గవర్నర్ ఫిర్యాదు
మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్‌మ్యాన్‌లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు ఒక ప్రాధమిక అంచనాకు వచ్చిప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.