ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో TRS ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: జానారెడ్డి
ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో TRS ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు జానారెడ్డి. నాయకుల్ని కొనుగోలు చేస్తున్న KCRకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు;
ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో TRS ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు జానారెడ్డి. నాయకుల్ని కొనుగోలు చేస్తున్న KCRకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు. గుర్రంపోడులో 25 వేల ఎకరాలకు తాగునీరు ఇచ్చింది తామేనని గుర్తు చేశారు. పేదల ఇళ్ల కోసం భూసేకరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, రుణమాఫీ, కొత్త పెన్షన్లు ఇలా ఏమీ అమలు కావడం లేదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అటు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి జానారెడ్డేనని ఆయన్ను ఈ బైపోల్‌లో గెలిపించుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో జానారెడ్డితో కలిసి PCC చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి ప్రచారం చేశారు. అధికారబలం, ధనబలంతో గెలవాలని టీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తోందని నేతలు మండిపడ్డారు.