Harish Rao : అమీర్‌పేట్ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం : హరీష్ రావు
Harish Rao : హైదరాబాద్ అమీర్ పేట గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అద్భుతంగా అభివృద్దిచేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.;
Harish Rao : హైదరాబాద్ అమీర్ పేట గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అద్భుతంగా అభివృద్ది చేయడానికి అన్నిరకాల సౌకర్యాలు,వసతులు కల్పించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైద్యంలో ప్రసిద్ధిపొందిన మంతెన సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
నేచర్ క్యూర్ విభాగం నుంచి ప్రత్యేక బృందం విజయవాడలోని మంతెన సత్యనారాయణ నేచురోపతి ఆసుపత్రిని సందర్శించి ... అక్కడ అందుతున్న సేవలను,ఇతర సదుపాయాలను అధ్యయనం చేయాలన్నారు. నేచుర్ క్యూర్ ఆస్పత్రిలో ఓపి, ఐపీ సేవలను మరింత మెరుగు పరుచాలన్నారు.