బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పై బాల్క సుమన్ విమర్శలు
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.;
బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీగా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు హామీ ఏమైందో చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీ గురించి ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు.