Balka Suman : కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌ రెడ్డికి లేదు : బాల్క సుమన్

Balka Suman : గాంధీ కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గులాం చేస్తున్నారని ఆరోపించారు టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్.

Update: 2022-03-30 15:15 GMT

Balka Suman : గాంధీ కుటుంబానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గులాం చేస్తున్నారని ఆరోపించారు టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తన ఆస్తులను పెంచుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ ఆస్తులను పెంచుతున్నారని బాల్కసుమన్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు దొంగదారిన కేసులు వేసింది నిజం కాదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇలానే మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదని బాల్కసుమన్ హెచ్చరించారు.

Tags:    

Similar News