TRS ఎమ్మెల్సీ వాణిదేవి కారుకు ప్రమాదం
క్షణాల్లోనే 100 స్పీడ్‌తో వెహికిల్ అక్కడున్న గన్‌మెన్లవైపు దూసుకెళ్లింది.;
TRS ఎమ్మెల్సీ వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. ఆమెను అసెంబ్లీలో దించి తిరిగి వెళ్తున్నప్పుడు గేట్ నం-8ని బలంగా ఢీకొట్టింది ఇన్నోవా కారు. దీంతో... కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. టైర్ పేలి భారీ శబ్దం వచ్చింది. ఐతే.. అదృష్టవశాత్తూ భద్రతా సిబ్బంది ఎవరికీ ఏమీ కాలేదు. వాహనాన్ని డ్రైవర్‌కి బదులు గన్‌మెన్ వాహనం నడపడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు. బయటకు వచ్చేప్పుడు బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కడం వల్లే వాహనం అదుపు తప్పినట్టు భావిస్తున్నారు. క్షణాల్లోనే 100 స్పీడ్‌తో వెహికిల్ అక్కడున్న గన్‌మెన్లవైపు దూసుకెళ్లింది. 8-వ గేట్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనను CP అంజనీకుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. MLC వాణిదేవి కారు ప్రమాదానికి కారణమైన PSO భానుప్రకాష్‌ను సస్పెండ్ చేశారు. నిబంధనల ప్రకారం చూసినా.. పర్సనల్ సెక్యూరిటీగా ఉన్న వారు ఎవరికైతే భద్రత కోసం వెళ్తున్నారో వారి వాహనం నడపడానికి వీల్లేదని, నిర్లక్ష్యంగా వ్యవహిరించి ప్రమాదానికి కారణమైన గన్‌మెన్‌పై CP ఆగ్రహం వ్యక్తం చేశారు.