పీవీకి అరుదైన గౌరవం కల్పించిన తెలంగాణ సర్కార్!
పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి.అని దేశానికి దిక్సూచి అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. పీవీ అందరికీ ఆదర్శప్రాయుడుని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీవీ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు;
బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు పలువురు నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో సంస్మరణ సభ నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా, రాజ్యసభ ఎంపీ కేకే, ఎమ్మెల్సీ కవిత, పలువురు మంత్రులు నివాళులర్పించారు.
పీవీ వ్యక్తి కాదు ఒక శక్తి.అని దేశానికి దిక్సూచి అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి. పీవీ అందరికీ ఆదర్శప్రాయుడుని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీవీ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. పీవీ మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచనలు మన వెంట ఉన్నాయన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పీవీ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు ఎంపీ కేకే. అన్నట్లుగానే ఇప్పుడు పీవీ జయంత ఉత్సవాలు జరుపుతున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి ఒక తీర్మానం చేసి పంపుతామన్నారు. పీవీ పేరుతో ఒక స్టాంప్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు కేకే.