రేపు టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ భేటీ..!
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించనున్నట్లు సమాచారం.;
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం.. అందుకోసం తేదీల ఖరారు, తదితర అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దళితబంధు అమలులో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి.. తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.