TS : వరంగల్ ను బీఆర్ఎస్ గూండాలు ఆక్రమించుకున్నారు : రేవంత్

Update: 2023-02-22 05:27 GMT

వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గూండాలు ఆక్రమించుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల భూ అక్రమాలపై ఆధారాలున్నాయన్న రేవంత్ బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. వీధికుక్కల దాడిలోబాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి కేటీర్ సారీ చెప్పి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పాల్లొన్న రేవంత్ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమలాపూర్‌లో ప్రారంభమయిన పాదయాత్రలో ఉదయం కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు చిట్యాల వద్ద లంచ్ విరామం తీసుకోనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం 4 గంటలకు చిట్యాల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఏలేటి రామయ్యపల్లి, నవాబుపేట గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రి 7 గంటలకు మొగుళ్లపల్లి బస్టాండ్ సెంటర్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రసంగించనున్నారు.

Similar News