తెలంగాణ బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు మహేశ్వర్‌రెడ్డి. తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడతామని.. అది బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా స్పష్టత లేదని.. అంతా అయోమయమేనని విమర్శించారు. మహేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం హర్షణీయమన్నారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన అంతమొందించడం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. అందరం కలిసికట్టుగా అహంకార పాలనకు ముగింపు పలుకుతామని అన్నారు.