మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రసిద్ధపుణ్య క్షేత్రం ఏడుపాయల శ్రీవన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 1997 నుంచి మైనంపల్లి సోషల్ సర్వీస్ పనిచేస్తుందన్నారాయన. మెదక్ నియోజకవర్గ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మైనంపల్లి రోహిత్ మెడిసిన్ పూర్తి చేశాడని, ఇకపై మైనంపల్లి సోషల్ సర్వెసెస్ పూర్తి బాధ్యతలు తాను చూసుకుంటానన్నారు. ప్రతి మండలంలో స్కూళ్లను రోల్ మోడల్‌గా తయారు చేస్తామని..... మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామన్నారు మైనంపల్లి హన్మంతరావు.