Telangana :మరో రెండు ఉప ఎన్నికలు తప్పవా..?

Update: 2025-11-21 13:30 GMT

తెలంగాణలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే మరో రెండు ఉప ఎన్నికలు తప్పేలా లేవు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో స్పీకర్ వేగం పెంచారు. ఇందులో భాగంగానే కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు. అనర్హత పిటిషన్ లపై అఫిడవిట్ లు దాఖలు చేయాలని నోటీసుల్లో తెలిపారు. గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినా సరే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరొకసారి నోటీసులు ఇచ్చారు.

కానీ వారిద్దరీ తీరు చూస్తుంటే రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నోటీసులపై పెద్దగా రెస్పాండ్ కావట్లేదని సమాచారం. దానం నాగేందర్ నిన్న ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఆయన తీరు చూస్తుంటే రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి గెలవాలని ఆయన ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండటంతో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి అనర్హత పడేలోపే తానే ఒక నిర్ణయం తీసుకోవాలని దానం నాగేందర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అటు కడియం శ్రీహరి బిఆర్ఎస్ వైపు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. స్టేషన్ ఘనపూర్ లో మరోసారి ఉప ఎన్నిక వచ్చిన సరే తానే గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. అందుకే రాజీనామా సరైనదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నోటీసులపై పెద్దగా రియాక్ట్ కావట్లేదు. ఎలాగూ తిరిగి బిఆర్ఎస్ లోకి వెళ్లే పరిస్థితులు లేవు కాబట్టి.. తనతో పాటు తన కూతురు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే త్వరలోనే తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు తప్పేలా లేవు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.


Full View

Tags:    

Similar News