Telangana: కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లు పెంచాలంటూ నిరుద్యోగుల డిమాండ్..
Telangana: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి మూడేళ్లకు పెంచింది ప్రభుత్వం.;
Telangana: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి మూడేళ్లకు పెంచింది ప్రభుత్వం. అయితే.. అదనంగా మరో రెండేళ్లు పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో యూనిఫాం సర్వీసుల పోస్టుకు గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు ఉందన్నారు. తెలంగాణలో మాత్రమే 30 సంవత్సరాలు వయోపరిమితిగా ఉందని తెలిపారు. కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.