యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మోరేశ్వర్ పాటిల్ దర్శించుకున్నారు.;
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మోరేశ్వర్ పాటిల్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేద ఆశీర్వచనాలు చేశారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, అష్టోతర పూజల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు మోరేశ్వర్ పాటిల్ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణలో కూడ అమలుచేయాలన్నారు కేంద్రమంత్రి మోరేశ్వర్ పాటిల్. పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలకు కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు కలిపి ఎలా వాడుతున్నారో..అలాగే ఆవాస్ యోజన పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు.యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కేంద్రమంత్రి పర్యటించారు. వెల్లంకి గ్రామం జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్ కి ఎంపిక కావాలని ఆశిస్తున్నట్లు మోరేశ్వర్ పాటిల్ పేర్కొన్నారు.