Kaleshwaram Project: కాళేశ్వరం కట్టడమే పెద్ద తప్పిదం.. ఉత్తమ్

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రమిదే..!

Update: 2024-02-18 05:30 GMT

 డిజైన్ , నాణ్యతాలోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని తెలంగాణ ప్రభుత్వంవెల్లడించింది. ఈ మేరకు నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చను ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత నీటిపారుదల రంగంలో.. ఇంతపెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదన్న ఆయన అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్లానింగ్, డిజైన్, నాణ్యతా లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించిందని వివరించారు.ప్రాజెక్టు నిర్వహణలోనూ నిర్లక్ష్యం ఉందన్న ఆయన, మేడిగడ్డ ప్రారంభమైన 2019 నుంచి 4 ఏళ్లపాటు పర్యవేక్షణ, నిర్వహణ సరిగా లేదన్నారు. ఆ విషయం అప్పటి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వల్లే బ్యారేజ్ పియర్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డకు వాడిన సాంకేతిక సామగ్రినే అన్నారం, సుందిళ్లకు వాడారన్న ఉత్తమ్ఆ  రెండు బ్యారేజ్ ల్లోనూ నీరు నింపవద్దని ప్రభుత్వానికి NDSA సలహా ఇచ్చిందన్నారు. అన్నారంలోనూ నుంచి లీకులు మొదలయ్యాయన్న ఉత్తమ్పరిశీలన కోసం NDSA బృందాన్ని పిలిచామని తెలిపారు. మేడిగడ్డ మాదిరిగా అన్నారంలో ప్రమాదం పొంచి ఉందని NDSA చెప్పిందని వివరించారు. దేశం, రాష్ట్రం అవాక్కయ్యే విషయాలను కాగ్ నివేదికలో పొందుపరిచారని గుర్తుచేశారు. NDSA, విజిలెన్స్ , కాగ్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags:    

Similar News