Vizag To Secunderabad Trains: వైజాగ్ టు సికింద్రాబాద్.. ఆ మూడు రోజులు స్పెషల్ ట్రైన్స్..

Vizag To Secunderabad Trains:తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్..ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది

Update: 2021-11-30 06:31 GMT

Vizag To Secunderabad Trains: తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ.. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీరిలో చాలామంది రైళ్లలో వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తారు. బస్సుల కంటే రైళ్ల టికెట్ ధర తక్కువగా ఉండడం.. సేఫ్టీ ఎక్కువగా ఉండడమే దీనికి కారణాలు. అందులోనూ ఎక్కువగా విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కే ప్రయాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే ఈ రూట్‌లోని రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది.

విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. అంతే కాకుండా డిసెంబర్ 1 నుంచే వీటిలో అందుబాటులోకి కూడా తెచ్చేస్తోంది. కొత్తగా ప్రారంభం కానున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..



రైలు నెంబర్ 08579.. ఇది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య వారానికి ఓసారి నడుస్తుంది. డిసెంబర్ 1 నుంచి ప్రతీ బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో ఈ రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ 2021 డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటుంది.

రైలు నెంబర్ 08580.. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వారానికి ఓసారి నడుస్తుంది. డిసెంబర్ 2 నుంచి ప్రతీ గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ 2021 డిసెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.


రైలు నెంబర్ 08585.. ఇది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య వారానికి ఓసారి నడుస్తుంది. డిసెంబర్ 7 నుంచి ప్రతీ మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో ఈ రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్ చేసుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ 2021 డిసెంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది.

రైలు నెంబర్ 08586.. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య వారానికి ఓసారి నడుస్తుంది. డిసెంబర్ 8 నుంచి ప్రతీ బుధవారం రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ 2021 డిసెంబర్ 29 వరకు అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News