కరోనా రోగులతో కిటకిటలాడుతోన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి
వరంగల్ MGM ఆసుపత్రి కరోనా రోగులతో కిటకిటలాడిపోతోంది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. పెద్ద సంఖ్యలో పెద్దాస్పత్రికి జనం వస్తున్నారు
వరంగల్ MGM ఆసుపత్రి కరోనా రోగులతో కిటకిటలాడిపోతోంది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. పెద్ద సంఖ్యలో పెద్దాస్పత్రికి జనం వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 440 బెడ్స్‌తో ఉన్న కోవిడ్ వార్డ్ సామర్ధ్యాన్ని 650 పడకలకు పెంచారు. ఎంజీఎంలో పూర్తిస్థాయిలో ఆక్సిజన్, కోవిడ్ మందులు అందుబాటులో ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఎంజిఎం అధికారులు చెబుతున్నారు. అటు వరంగల్ అర్బన్‌లో తాజాగా 244 కేసులు నమోదయ్యాయి.