KCR In Assembly : వక్ఫ్‌ భూములపై సీఐడీ విచారణకు ఆదేశిస్తాం : సీఎం కేసీఆర్‌

KCR In Assembly : గతంలో పంచాయతీలు ఎలా ఉండేవి.. ఇప్పుడెలా వున్నాయో కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Update: 2021-10-07 12:30 GMT

KCR In Assembly : గతంలో పంచాయతీలు ఎలా ఉండేవి.. ఇప్పుడెలా వున్నాయో కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు... పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.. భట్టి విక్రమార్ గతం విస్మరించి మాట్లాడుతున్నారన్నారు.. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలన్నారు.. పంచాయతీలకు వచ్చిన అవార్డులే అభివృద్ధిని అద్దంపడుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

వక్ఫ్‌ భూముల ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం సిద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు భూములు, దేవాదాయ భూములను కాపాడుకుంటామని చెప్పారు.. వక్ఫ్‌ భూములపై సీడీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. లోకల్‌ బాడీలకు ఏటికేడు నిధులు పెంచాల్సిన కేంద్ర ప్రభుత్వం.. తగ్గించుకుంటూ పోతోందని అసెంబ్లీ వేదికగా ఫైరయ్యారు సీఎం కేసీఆర్‌.. స్థానిక సంస్థలకు 25 శాతం కోతపెట్టడాన్ని కేసీఆర్‌ తీవ్రంగా తప్పు పట్టారు.. కేంద్రానికి మనం కట్టే పన్నుల కన్నా మన రాష్ట్రానికి ఇచ్చేది చాలా తక్కువన్నారు..

Tags:    

Similar News