Weather: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు

హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం;

Update: 2024-06-09 02:15 GMT

నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి జూన్ 9న తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్ గుండా వెళ్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి ఋతుపవనాలు రాబోయే 2 నుండి 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు వెల్లడించారు. నిన్న తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపారు.ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో) వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణ పేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇక హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం, రాత్రి సమయాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, దక్షిణ దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలుగా నమోదైంది. 76 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

  

Tags:    

Similar News