Tank Bund : హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై వీకెండ్ ట్రాఫిక్ ఆంక్షలు ..!
వీకెండ్లో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో సందడిగా మారతాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళల్లో ఆహ్లాదంగా గడిపేందుకు గ్రేటర్ వాసులు ఇష్టపడతారు.
వీకెండ్లో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో సందడిగా మారతాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళల్లో ఆహ్లాదంగా గడిపేందుకు గ్రేటర్ వాసులు ఇష్టపడతారు. అయితే అదే సమయంలో ట్రాఫిక్ రద్దీ కూడా అధికంగానే ఉండటంతో... తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
హైదరాబాద్ నగరానికి ప్రతీకగా ఉన్న ట్యాంక్ బండ్‌ను పర్యాటకులకు అనుకూలంగా ప్రభుత్వం ఆధునీకరించింది. ఇప్పటికే దాదాపు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో పర్యటకులకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు ట్రాఫిక్ డైవెర్షన్ చేశారు. తొలిరోజు ట్రాఫిక్ నియంత్రణపై హైదరాబాద్ పోలీస్ కమిషన్ అంజనీ కుమార్ పరిశీలించారు. వాహనాల దారిమళ్లింపుపై ట్రాఫిక్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలకు నగర ప్రజలంతా సహకరించాలని సీపీ కోరారు.